హైదరాబాద్: ఖైరతాబాద్‌లో 58 అడుగుల శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి సిద్ధమయ్యాడు. 130 మంది కళాకారులు దాదాపు రెండున్నర నెలలు కష్టపడి ఈ ప్రతిమను రూపొందించారు. విగ్రహ పనుల కోసం ఏర్పాటు చేసిన కర్రలు, సామగ్రి శనివారం సాయంత్రం తొలగించడంతో బొజ్జగణపయ్య విద్యుద్దీపాల వెలుగులో మెరిసిపోయాడు. భారీ గణనాథుడ్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. వినాయకుడికి ఓ వైపు తిరుపతి వెంకటేశ్వరుడు, మరోవైపు గోవర్ధనోద్ధారి ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ నరసింహన్ తొలి పూజలు చేసిన అనంతరం భక్తుల సందర్శనకు అనుమతిస్తారు.
అందంగా ముస్తాబైన ఖైరతాబాద్ గణేశుడు




