అందరికీ వర్తించేలా నిరుద్యోగ భృతి
సిపిఐ డిమాండ్
అనంతపురం,జూన్29(జనం సాక్షి ): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూ మేరకు ఉద్యోగం కల్పించడం లేదా నిరుద్యోగ భృతి ఇవ్వడం అన్న హావిూని అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్వర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులందరికీ రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగ భృతిని కల్పించినున్నట్లు వస్తున్న వార్తలను ఆయన స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం నిరుద్యోగులకు ఒక తీపి కబురు. అయితే కేవలం ఉపాధి కల్పనా కార్యాలయాలలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే నిరుద్యోగ భృతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోరాదని, అందరికి వర్తించేలా పథకాన్ఇన అమలు చేయాలని అన్నారు. ఈ అంశాన్ని రాష్ట్రప్రభుత్వం పునారాలోచించాలి. ఎందుకంటే చాలామంది గ్రావిూణ విద్యార్థులు, అవగాహన లేని విద్యార్థులు ఉపాధి కార్యాలయాలలో తమ వివరాలు నమోదు చేసుకోలేదన్నారు. లేదా అందరూ నమోదు చేసుకునేలా జిల్లాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్లలో నమోదు చేసుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. ఈ నిరుద్యోగ భృతి ముఖ్యంగా ఉద్యోగలు రాని వారికే చెందాలన్నారు. కావున దీనికొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ను రూపొందించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తే మంచిదన్నారు. ఐటి శాఖ మంత్రి లోకేశ్ దీనికోసం కసరత్తు చేయాలన్నారు. నిరుద్యోగుల వివరాలను సేకరించడంలో భాగంగా దారిద్యర్రేఖకు దిగువన ఉన్న విద్యార్థుల వివరాల సేకరణకుగాను తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే నిజమైన నిరుద్యోగులు ఎక్కువశాతం బయటపడతారు. అదే విధంగా నిరుద్యోగుల్లో కొందరికి తెల్ల రేషన్ కార్డు లేదు. వీరినీ దృష్టిలో ఉంచుకుని ఇటువంటి వారి వివరాల కొరకు కుటుంబ సంవత్సర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని, తద్వారా నిజమైన నిరుద్యోగులను ఎంపిక చేసి, వారికే నిరుద్యోగభృతి అందచేయాలన్నారు. ఈ నిధులు పక్కదారి మళ్లకుండా నగదు మొత్తాన్ని నిరుద్యోగుల ఖాతాలలో నేరుగా ప్రతినెల జమ చేయాలన్నారు.
———