విజయనగరం,నవంబర్5(జనంసాక్షి): అంధులకు ఆపన్న హస్తం అందించాలని ఉద్దేశ్యంతో బీడీవీపీ సేవసంస్థ పలు సేవా కార్యక్రమాలును గత 6 ఏళ్లుగా నిర్వహిస్తుంది. బ్రమ్మ దేవా దుర్గవెంకటప్రసాద్, బ్రమ్మ దేవా సత్యనారాయణ వర్ధంతిని పురస్కరించుకొని విజయనగరం పులబాగ్ సవిూపంలో ఉన్న ద్వారకామాయి అంధుల పాఠశాలలో ఉన్న 55 మంది విద్యార్థులుకు రగ్గులు, 100 కేజీల బియ్యంను పాఠశాల నిర్వహుకులు సమక్షంలో విద్యార్థులుకు అందచేశారు.అలానే విద్యార్థులుకు పళ్ళు పంపిణి చేసారు. అలానే విద్యార్థులుకు ఉపయోగపడే ఏమైనా పరికరాలు అందచేస్తామని..అందుకు సంబంధించి వివరాలును అందచేయాలని పాఠశాల నిర్వహుకులును కోరారు. అందు విద్యార్థులుకు బీడీవీపీ సేవా సంస్థ అండగా ఉంటుంది అని సంస్థ నిర్వహుకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రమ్మ దేవా రామకృష్ణ , సాయిరాం, వెంకటేశ్ రమణ తదితరులు పాల్గొన్నారు.




