Tuesday, 3 November 2026

అంబరపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ అడిన పివీ సింధు
అంబరపేట,అక్టోబరు6(జనం సాక్షి):అంబరపేట నియోజకవర్గంలోని అంబరపేట మున్సిపల్ మైదానంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో ఆయన సతీమణి కావ్య, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, పెద్ద సంఖ్యలో మహిళలు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.అంతకు ముందు పీవీ సింధు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్,భాజపా మాజీ నగర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీ వివేక్, ఎక్కాల నందు,గౌతంరావు,అజయ్, శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు సాంబశివ గౌడ్,ఉమారాణి,వనం రమేశ్,పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.