Monday, 2 November 2026

అంబాజీపేటలో అగ్నిప్రమాదం

కాకినాడ,నవంబర్‌13(జ‌నంసాక్షి): అంబాజీ పేట మహిళల ఆసుపత్రి సవిూపంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వలన మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు స్థానికంగా ఉన్న చింతపల్లి చందరరావు, గోసంగి అమరావతిలకు చెందిన

ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఈ సంఘటనలో 3లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని వారు ప్రాథమికంగా అంచనా వేశారు. అగ్ని ప్రమాదంపై అమలాపురం అగ్నిమాపక కేంద్రానికి స్థానికులు సమాచారం అందించినప్పటికీ వారు సకాలంలో స్పందించకపోవడంతో స్థానికులే మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక సిబ్బంది తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.