ఏలూరు,నవంబర్13(జనంసాక్షి): రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో దశల వారీగా పట్టణ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు 5.28 లక్షల ఇళ్లను నిర్మిస్తామని రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి.నారాయణ అన్నారు. పేదల గృహాలకు అధికా ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. నర్సాపురం మండల పరిధిలో గృహ నిర్మాణం చేపట్టాల్సిన రెండు చోట్ల స్థలాలను ఎమ్మెల్యే మాధవ నాయుడు, ఛైర్పర్సన్ రత్నమాలతో కలసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు స్థలాల్లో ఏదోక స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా కలెక్టర్ని కోరతానన్నారు. ఆయన వెంట రాష్ట్ర మున్సిపల్ సంచాలకులు ఎ.కర్ణబాబు తదితరులున్నారు.




