అంబేడ్కర్‌ వల్లనే మనకు స్వేఛ్ఛ: మంత్రులు

గుంటూరు,మే10(జ‌నం సాక్షి): భారతదేశం ఇంత చక్కగా వర్ధిల్లుతుందంటే అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంవల్లే అని మంత్రులు పేర్కొన్నారు.అంబేద్కర్‌ పేరును ఉచ్చరించే స్థాయి వైసిపికి లేదన్నారు.  చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో మంత్రులు నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగ్గాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన పశువైద్యశాలను ప్రారంభించారు. రైతురథం ట్రాక్టర్లను పంపిణీ చేశారు. జలాది గ్రామంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు.  రాజశేఖరెడ్డి హయాంలో సబ్‌ ప్లాన్‌ నిధులు ఇడుపులపాయకు, హైదరాబాద్‌లో హుస్సేన్‌ సాగర్‌కు దారి మళ్లించారన్నారు. అవినీతి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

తాజావార్తలు