Thursday, 5 November 2026

కడప కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హరికిరణ్‌ 

కడప,మే10(జ‌నం సాక్షి): కడపజిల్లా కలెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. 2009 సివిల్స్‌ లో 18వ ర్యాంకు సాధించిన హరికిరణ్‌… తొలుత కృష్ణా జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా శిక్షణ పొందారు. ఆ తరువాత  భద్రాచలం, మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గా పనిచేసిన తరువాత మున్సిపల్‌ శాఖలో విధులు నిర్వహించారు. విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా, కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తూ కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హరికిరణ్‌కు కలెక్టర్‌ ఉద్యోగులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. తొలుత కాసేపు మల్లవరం, గిడుతూరు గ్రామాల్లో సైకిల్‌ తొక్కిన ఆయన, ఆపై అక్కడికి దగ్గర్లోని పీపీ అగ్రహారం చేరుకునేందుకు బుల్లెట్‌ పై బయలుదేరారు. ఓ మలుపు వద్ద బండి అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో విజరు గాయపడారు. ఆయన ఎడమ చెయ్యి విరిగింది. అక్కడే ఉన్న కార్యకర్తలు ఆయన్ను హుటాహుటిన నర్సీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 
—————-