Wednesday, 4 November 2026

అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ: హరీష్‌రావు

TRS govt supports to Dalits

మెదక్ : అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూ పంపిణీ కాగితాలపైనే చేశాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం దళితులకు సాగుకు యోగ్యమైన భూములే ఇస్తుందని చెప్పారు. రూ. వెయ్యి కోట్లతో దళితులకు భూమి కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. 50 యూనిట్ల వరకు కరెంట్ వాడే దళిత కుటుంబాలకు బిల్లు బకాయిలు ఎత్తివేశామని తెలిపారు. కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా దళిత కుటుంబాలను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *