![]() |
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకుంటారు కానీ అదే పని ఇక్కడ చేస్తే మాత్రం తప్పని గొంతు చించుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆనాడు టీఆర్‌ఎస్ సభ్యులను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. అప్పుడు అనైతికం అనిపించలేదా అని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై అడిగే హక్కు టీడీపీకి లేదన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటే సంతోషిస్తామన్నారు. ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగేవారికి తగు రీతిలో సమాధానం చెబుతామన్నారు. కాంగ్రెస్‌లో ఎప్పుడూ పదవుల లొల్లే ఉంటుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.





