Wednesday, 4 November 2026

లావా నుంచి ఐరిస్ ఎక్స్1

phoneప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ లావా.. దేశీయ మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. లావా ఐరిస్ ఎక్స్1 బీట్ పేరుతో లభించనున్న ఈ మొబైల్ ధర రూ.6,550గా నిర్ణయించింది. ఐదు అంగుళాల తాకేతెర కలిగిన దీంట్లో 1జీబీ ర్యామ్, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 5 మెగాపిక్సెల్ కెమెరా, ముందుభాగంలో 0.3 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటర్నల్గా 8జీబీ మెమొరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 2,200ఎంఏహెచ్ బ్యాటరీ ద్వారా 3జీ సర్వీసుల కింద 11 గంటల పాటు నిరాటంకంగా మాట్లాడుకోవచ్చును. నిలకడగా 146 గంటల పాటు పనిచేయనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *