అక్రమ మైనింగ్‌ ఇకనైనా ఆపాలి

– క్వారీ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం
– ఇంత జరుగుతుంటే ఘనుల శాఖ మంత్రి నిద్రపోతున్నాడా?
– ఇలాంటి క్వారీలను మూయకుంటే జనసేన కార్యకర్తలే మూసేస్తారు
– జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
– హత్తిబెళగల్‌ క్వారీ పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన పవన్‌
కర్నూలు, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసినప్పుడే హత్తిబెళగల్‌ క్వారీ పేలుడు లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. హత్తిబెళగల్‌ క్వారీలో జరిగిన పేలుడు బాధితులను పవన్‌ సోమవారం పరామర్శించారు. పవన్‌ రాక సందర్భంగా కర్నూలు నగరంలోని టోల్‌గేట్‌నుంచి హనుమాన్‌ సర్కిల్‌ వరకు అభిమానులు పెద్దయెత్తున ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం హత్తిబెళగల్‌కు వెళ్లిన ఆయన ప్రమాదానికి కారణమైన క్వారీని పరిశీలించారు. ఈ సమయంలో భారీ ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకోవటంతో పవన్‌ కళ్యాణ్‌ ముందుకెళ్లే పరిస్థితి లేక కొంత ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి నుండి నేరుగా వెళ్లి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ విూడియాతో మాట్లాడుతూ.. హత్తిబెళగల్‌ క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో తెదేపా నేతలను సమర్థించి ప్రజా సమస్యలను విస్మరించవద్దని కోరారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే గనుల శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారని అన్నారు. 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నాయని స్థానిక యువత తన దృష్టికి తీసుకొచ్చినట్లు పవన్‌ తెలిపారు. యువకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై త్వరలోనే స్పందిస్తానని పేర్కొన్నారు. క్వారీ ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. ఇలాంటి క్వారీలను మూయకుంటే జనసేన కార్యకర్తలే మేసేస్తారని పవన్‌ హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదాలు జరుతుంటే గనులశాఖ మంత్రి నిద్ర పోతున్నారా అంటూ ప్రశ్నించారు. మంత్రులు బాధ్యతాయుతంగా వవ్యవహరించాలని, స్వలాభంకోసం అమాయకుల ప్రాణాలను ఫణంగా ఫెట్టవద్దన్నారు.

తాజావార్తలు