అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ తెలంగాణ అధ్యక్షులుగా కౌలే జగన్నాథం

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ తెలంగాణ అధ్యక్షులుగా కౌలే జగన్నాథం నియమితులయ్యారు  .ఈ మేరకు భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ అధ్యక్షుడు అశ్వినిశర్మ  ‘జాతీయ సలహాదారుల చిన్మయా ఆచారి , జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జాతీయ యూత్ అధ్యక్షుడు దిలీప్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు  .ఈ సందర్భంగా కౌలెే జగన్నాథం మాట్లాడుతూ  రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారతీయ విశ్వకర్మ  సంఘం ని    బలోపేతం చేసి  విశ్వకర్మ ల అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు  . నాపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు  జాతీయ అధ్యక్షులు అశ్వినీ శర్మకి  ,ఇతర కార్యవర్గానికి ప్రత్యేకంగా కౌలే జగన్నాథం  ఈ సందర్బంగా   ధన్యవాదాలు తెలిపారు

తాజావార్తలు