విశాఖ : అఖిల భారత మేజర్ పోర్టు క్రీడా పోటీలు డైమండ్ జూబ్లీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. పోటీలను విశాఖ పోర్ట్ ట్రస్టు డిప్యూటి ఛైర్మన్ సత్యకుమార్ ముఖ్య అతిధిగా పాల్గోని ప్రారంభించారు. విశాఖ, చెన్నై, కోచి, ముంబయి తదితర పోర్ట్ జట్లు క్రీడల్లో పాల్గొన్నాయి. మూడు విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు.




