Tuesday, 3 November 2026

. అగస్టా నిందితులకు సమన్లు

7

దిల్లీ, డిసెంబర్‌ 20(జనంసాక్షి): రూ.3600 కోట్ల విలువైన హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రూ.360 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) రూపొందించిన అభియోగ పత్రాలను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం పరిగణనలో తీసుకొంది. జనవరి 19వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా న్యాయమూర్తి వి.కె.గుప్తా నిందితులను ఆదేశించారు. అరెస్టయి కారాగారంలో ఉన్న వ్యాపారవేత్త గౌతమ్‌ ఖైతాన్‌, ఆయన భార్య రీతు, ఇటలీకి చెందిన కార్లో గెరోసా, గైడో హస్చ్‌కే, చండీగఢ్‌కు చెందిన ఏరోమ్యాట్రిక్‌న్సీ సంస్థలకు ఈ మేరకు సమన్లు జారీ చేశారు. నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వీరిపై ఈడీ అభియోగపత్రాలను దాఖలు చేసింది. ఖైతాన్‌ పెట్టుకున్న బెయిల్‌ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అతిమ్యుా వ్యక్తులు వాడేందుకు వీలుగా 12 హెలీకాప్టర్లను కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందంపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *