Monday, 2 November 2026

నేడు కొమురవెల్లికి కేసీఆర్‌

5

వరంగల్‌,డిసెంబర్‌20(జనంసాక్షి): తెలంగాణలో అతిఆ ముఖ్యమైన కొమురవెల్లి జాతరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాల్గొంటున్నారు. ఈనెల 21న కొమురవెల్లి ఆలయంలో జరిగే కల్యాణోత్సవానికి ఆయన రానున్నారు. ఇది వరంగల్‌ జిల్లా పరిధిలో ఉన్నా సిద్దిపేటకు సవిూపంలో ఉంది. ఆయన హైదరాబాద్‌ నుంచి నేరుగా హెలిక్టాపర్‌ ద్వారా కొమురవెల్లి చేరుకుంటారు. మల్లన్న కల్యాణోత్సవంలో పాల్గొని అక్కడ నిర్మించిన కురుమ భవన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌ వెళ్తారు. కాగా రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారి శనివారం జిల్లాకు రావాల్సిన మంత్రి చందూలాల్‌, పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్‌ల పర్యటనలు వాయిదా పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *