Wednesday, 4 November 2026

అగ్నిప్రమాదాలు జరక్కుండా చూసుకోవాలి

 

దీపావళి బాణాసంచాపై అధికారుల సూచనలు

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): దీపావళి పండుగ సందర్భంగా అగ్నిప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ గోపీకృష్ణ సూచించారు. ప్రమాదాలు జరిగిన తరవాత ఆందోళన చెందేకన్నా ముందే జాగ్రత్త వహించాలన్నారు. ఒకవేళ ప్రమాదం జరిగితే 101 లేదా 9949991101 నంబర్లకు ఫోన్‌ చేయాలని గోపీకృష్ణ సూచించారు. దీపావళి పండుగ సమయంలో హైదరాబాద్‌ లో కంట్రోల్‌ రూమ్‌ చురుగ్గా పని చేస్తుందని చెప్పారు. దీపావళి పండుగ నేపథ్యంలో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీపావళి పండుగ జరుపుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే దానిపై అవగాహన కార్యక్రమాలు రూపొందించామని గోపీకృష్ణ వెల్లడించారు. గతేడాది 12 అగ్ని ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రమాదాలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఫెర్‌ క్రాకర్స్‌ అమ్మే రిటైల్‌ షాపులు, ¬ల్‌ సేల్‌ దుకాణాలు, గోడౌన్ల ఏర్పాటుకు ఫైర్‌ అధికారుల అనుమతి తప్పనిసరి అన్నారు. మొత్తం 4,258 బాణసంచా దుకాణాలకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. ప్రతి దుకాణం సెప్టీ నిబంధనలు పాటించాలని గోపీకృష్ణ స్పష్టం చేశారు.