అడవుల్లో పలచగా ఉన్న చోట్ల మొక్కల పెంపకం
ప్రణాళిక సిద్దం చేసిన అటవీశాఖ
ఆదిలాబాద్,జూలై10(జనంసాక్షి): ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశారు.అటవీ ప్రాంతాల్లోని పలుచగా ఉన్న చోట 24.53 లక్షలు, ఇతర ప్రాంతాల్లో లక్ష మొక్కలను నాటేందుకు అటవీశాఖ అధికారుల చ ర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తోండడంతో అధికారుల నాలుగో విడ త హరితహారానికి సిద్ధమయ్యారు. ఈ విడతలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కోటి మొక్కలను నాటాలని అధికారులు నిర్ణయించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలను, డీఆర్‌డీవో ఆధ్వర్యంలో 34 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా ఎంచుకోగా పలు ప్రభుత్వ శాఖలకు సైతం లక్ష్యాలని నిర్దేశిరచారు. జిల్లాలో నాలుగో విడత హరితహారంలో కోటి మొక్కలు నాటాలని నిర్ణయించగా ఇందుకు అవసరమైన మొక్కలను వివిధ శాఖల ఆధ్వర్యంలో నర్సరీల్లో సిద్ధం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 58 నర్సరీల్లో వివిధ రకాల మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి డీఆర్‌డీవో, మున్సిపల్, ఐటీడీఏ ఆధ్వర్యంలో సైతం వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఈ విడతలో మొక్కలు నాటాల్సిన ప్రాంతాలను ముందుగానే గుర్తించిన అధికారులు ఏయే ప్రాంతాల్లో ఎలాంటి మొక్కలు నాటాలనే వాటిని గు ర్తించి వాటిని నర్సరీల్లో సిద్ధం చేశారు. ప్రజలు ఇండ్లలో పెంచుకునేందుకు అవసరమైన మొక్కలను సైతం నర్సరీల్లో పెంచారు. ప్రజలకు అవసరమైన మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 34 లక్షల మొక్కలను నాటనున్నారు. గ్రామాల్లోని వివిధ ప్రాం తాల్లో 15 లక్షల టేకు, 8లక్షల సీతాఫల్, మలబార్, వేప, 5 లక్షల కల్పేతర మొక్కలు, ప్రతి ఇంటికి 6 మొక్కల చొ ప్పున 6 లక్షల వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటేందుకు అధికారు లు చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2 లక్షల మొక్కలు, వ్యవసాయశాఖచే రైతులు భూముల్లో 5 లక్షలు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో లక్ష, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 2 వేల గ్రా మాల్లో 4.86 లక్షలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లక్ష, నీటిపారుదల శాఖ ఆ ధ్వర్యంలో 45 వేల నాటేందుకు ప్రణాళికల సిద్ధం చేశారు. ఇతర ప్రభుత్వశాఖలైన పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం, విద్యాశాఖ, మార్కెటింగ్, ఎస్సీ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, మైనార్టీ, ఆర్టీ సీ, విద్యుత్, పరిశ్రమలు, పశు సంవర్థక, మహిళా శిశు సంక్షేమం, వైద్య శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటున్నారు.