Thursday, 5 November 2026

అధికారికంగా పూలే జయంతి

3m7sohgaహైదరాబాద్

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి జోగు రామన్న చెప్పారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు రూ. 2 లక్షలు, హైదరాబాద్, సికింద్రాబాద్ కు రూ. 5.60 లక్షలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. శనివారం అంబర్ పేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పిస్తరని మంత్రి ప్రకటించారు. రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. బీసీలకు సబ్ ప్లాన్ కోసం ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. బీసీల్లోని సంచార జాతులకు మొదటి ప్రాధాన్యతగా పక్కా ఇండ్లను కట్టిస్తామని జోగు రామన్న ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *