Saturday, 7 November 2026

అధికారులతో రావత్‌ భేటీ

ఎన్నికల ఏర్పాట్లపై సవిూక్ష

హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రావత్‌ అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ¬టల్‌ తాజ్‌కృష్ణలో జిల్లా ఎన్నికల అధికారులు, ఐజీలు, ఎస్పీలతో భేటీ అయ్యారు. పోలింగ్‌, భద్రత ఏర్పాట్లు, డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణ చర్యలపై జిల్లాల వారీగా అధికారులతో చర్చించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. దివ్యాంగులు ఓటు వేసేందుకు ప్రోత్సహించేలా రూపొందించిన నాలుగు లఘు చిత్రాలను రావత్‌ ఈ సందర్భంగా విడుదల చేశారు. దివ్యాంగులందరూ ఓట్లు వేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఆదాయపన్ను, ఎక్సైజ్‌, రవాణా, వాణిజ్య పన్నులు, రైల్వే, విమానాశ్రయం తదితర విభాగాలకు చెందిన నోడల్‌ అధికారులతో రావత్‌ సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగున్నరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ¬ంశాఖ కార్యదర్శి, డీజీపీతో చర్చించనున్నారు.