రాహుల్ నీచరాజకీయాలకు పాల్పడుతున్నాడు
– ఎమర్జెన్సీతో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది
– ఇందిరాబాటలోనే రాహుల్ వెళ్తున్నాడు
– తెలంగాణలో బీజేపీ పుంజుకుంది
– బీజేపీ అఖిల భారత అధికార ప్రతినిధి సంబీత్ పాత్ర
హైదరాబాద్ , జూన్26(జనం సాక్షి) : అధికార దాహంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ అఖిల భారత అధికార ప్రతినిధి సంబీత్ పాత్ర విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజల సొమ్ము దోచుకున్నారని ధ్వజమెత్తారు. విూ కుటుంబం, ప్రత్యేకంగా విూ నానమ్మ ఏమి చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. 43 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమనించారని మండిపడ్డారు. అంతేకాక ఆర్టికల్ 21ని సస్సెండ్ చేసిన విషయాన్ని సంబీత్ గుర్తు చేశారు. జూన్ 25న,1975లో దివంగత నేత ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. అదే బాటలో రాహుల్ వెళ్తున్నారు. నిరంకుశ దారిలో పోతున్నాడు. ప్రతి ఓటమి తర్వాత ఈవీఎం, ఈసీఐని విమర్శిస్తున్నారు. సీజేఐపై అభిశంసన పెట్టాలని చూశాడు. సంఘ కార్యకర్తలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. జైలుకి వెళ్ళారు. భారత్‌ను పాలించడానికి మాకే హక్కు ఉందని ఆ కుటుంబం అనుకుంటుంది. దివంగత నేత నెహ్రూ కారణంగానే ఇంకా కాశ్మీర్ సమస్య ఉంది. ఆ కుటుంబంలో అందిరివి నియంతృత్వ పోకడలేనన్నారు. అప్రకటిత ఆదాయంతో రాబర్ట్ వాద్రా రూ. 85 కోట్లు ఐటీ కట్టారని వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులు కట్టక పోవడం నియంతృత్వమేనన్నారు. వారసత్వ రాజకీయలు చేస్తున్న వారు.. ప్రజాస్వామ్య వాదులు కారని, న్యూ జిన్నా అసదుద్దీన్ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల విభజన చేసే విధంగా ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనకళ్యాణ్ నీతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రణనీతితో ఒక్కో రాష్ట్రములో అధికారంలోకి వస్తున్నామన్నారు. పరివార్ వాద, జాతి వాద, సంతుష్టు కరణ రాజకీయాలకి వ్యతిరేకమన్నారు. తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వాని ఓటమి తప్పదని, మేం కూడా తెలంగాణలో పుంజుకుంటున్నామన్నారు. ముందుస్తు ఎన్నికలు అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని బీజేపీ నేత సంబీత్ పాత్ర స్పష్టం చేశారు.
అధికార దాహంతో..




