50 ఏళ్లలో ఏవిూ చేయలేని వారు ఇప్పుడెలా చేస్తారు
– పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ
– అభివృద్ధిలో రాజేంద్రనగర్ దూసుకుపోతుంది
– బుద్వేల్, కిస్మత్‌పూర్ మధ్య 28 ఐటీ కంపెనీలు రాబోతున్నాయి
– రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
– రాజేంద్రనగర్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం
హైదరాబాద్, న్26(జనం సాక్షి): ఊరుకాలదు పీరి లేవదన్న రీతిలో కాంగ్రెసోళ్ల తీరుందని మంత్రి కెటిఆర్ ఘాటుగా విమర్శించారు. 50 ఏళ్లలో ఏవిూ చేయలేని వారు ఇప్పుడు చేస్తామని అంటే ప్రజలు నమ్మడం లేదని, అందుకే కెసిఆర్‌ను సిఎం చేశారని అన్నారు. తెలంగాణ ఇచ్చినం..తెలంగాణ ఇచ్చినం అని ప్రచారం చేసుకోవడం తప్ప వాల్లుచేసిందేవిూ లేదన్నారు. ఇన్నేళ్లూ ఏవిూ చేయలేనోళ్లు ఇప్పుడు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం మంత్రి కేటీఆర్ రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ను ఉతికి ఆరేశారు. రాహుగాంధీ మొదలు ఎవరు వచ్చినా తెలంగాణలో చేసేదేవిూ లేదన్నారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీది ద్రోహ చరిత్ర అని అన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏవిూ లేదని పేర్కొన్నారు. నాడు ఆంధ్రతో కలిపిన నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్సేనని తెలిపారు. స్వయంపాలన కోసం ఉద్యమించిన ప్రతిసారీ వందల మందిని బలితీసుకొన్న పార్టీ.. చివరకు కేసీఆర్ నాయకత్వంలో నడిచిన ఉద్యమానికి తలవంచక తప్పలేదని స్పష్టంచేశారు. ఒకప్పుడు దేశానికి ఆంధప్రదేశ్ అన్నపూర్ణగా ఉండేదని.. ఇప్పుడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా మారిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలవడం ఖాయమని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నాయకుల్లాగా కవిూషన్‌ల కక్కుర్తి, పర్సంటేజీల అలవాటు, అవసరం టీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఇకపోతే తెలంగాణలో ఏ పథకం అమలవుతోందో.. దేశమంతా ఆ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అంటున్నారని, నాలుగేళ్లలో తెలంగాణకు అంతటి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తారకరామారావు అన్నారు. అభివృద్ధిలో రాజేంద్రనగర్ దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుద్వేల్, కిస్మత్‌పూర్ మధ్య 28 ఐటీ కంపెనీలు రాబోతున్నాయన్నారు. నాలుగైదేళ్లలో బుద్వేల్, కిస్మత్‌పుర రూపు రేఖలు మారిపోతాయని చెప్పారు. రూ.100 కోట్లతో గండిపేటను అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతా మన్నారు. రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణికులు పెరుగుతున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఏం చేస్తరో.. దేశమంతా అదే జరుగుతుందని అందరూ అనుకుంటున్నరని కేటీఆర్ పేర్కొన్నారు. పంటకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 58 లక్షల మందికి పైగా అన్నదాతలకు రైతు బీమా కల్పిస్తున్నమని చెప్పారు. గత పాలకులు పెన్షన్ల కోసం నానా గోసపెట్టారని మండిపడ్డారు. 42 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నం. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్షా 116 ఇస్తున్నమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్,ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తో ఒరిగేదేవిూ లేదు




