అధిక ఫీజుల స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

కడప,జూలై5(జ‌నం సాక్షి): రైల్వే కోడూరు పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నేతలు అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక మండల విద్యాశాఖ అధికారి పోతురాజు రామయ్యకు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు జాన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ…జిల్లా ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు పదహైదు వేల నుంచి, నలభై వేల వరకు ఫీజులు వసూళ్లు చేస్తున్నారని, పాఠశాలల్లో ఫీజులకు సంబంధించిన పట్టికను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కమిటి సభ్యులు శ్రీకృష్ణ హరినాథ్‌ , వేణు , ఈశ్వర్‌ , ఖాదర్భాష, సునందకుమార్‌ లు పాల్గొన్నారు