అనంతపురం: జిల్లా కేంద్రంలో ఎస్సై రామయ్య కీచకపర్వం కొనసాగింది. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై రామయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.




