Tuesday, 3 November 2026

అనంత ఘోరం

4 copy

రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి

అనంతపురం,జనవరి7(జనంసాక్షి): అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్లెఓ వెలుగు లోయలో పడిన  ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందారు. 40 మందికి గాయాలయ్యాయి.  పెనుకొండ-మడకశిర మార్గంలో బుధవారం ఉదయం ఆర్టీసీ పల్లెవెలుగు  బస్సు లోయలో పడింది.  బస్సు మడకశిర నుంచి పెనుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హిందూపురం, బెంగళూరులోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు నంబర్‌ ఏపీ 28 జడ్‌ 1053గా గుర్తించారు. మడకశిర-పెనుకొండ మార్గంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సు పక్కనే ఉన్న 20 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. పెనుకొండకు 15 కి.విూ దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయిన సందర్భంలో  బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదానికి డ్రైవర్‌ అప్రమత్తంగా లేకపోవడమే కారణంగా భావిస్తున్నారు. పెనుకొండ-మడకశిర మార్గంలో ఘాట్‌ రోడ్డు ఉంది. ఆమార్గంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు మార్గం తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కూడా భావిస్తున్నారు.

ప్రమాదంపై చంద్రబాబు దిగ్భాంతి

బస్సు ప్రమాద ఘటనపై  ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన తీవ్ర సంతాపం ప్రకటించారు. విజయవాడలో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల్లో ఏడుగురు ఇంటర్‌ విద్యార్థులు, ఒకరు అటవీ శాఖ గార్డు ఉన్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ఘటనాస్థలికి మంత్రులు

అనంతపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న ఘటనాస్థలికి ఏపీ మంత్రులు శిద్దా రాఘవరావు, ప్లలె రఘునాథరెడ్డి, పరిటాల సునీత బయలుదేరారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని శిద్దా చెప్పారు.  బస్సు లోయలో పడి 14 మంది మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ ¬ంశాఖ మంత్రి చినరాజప్ప ఆదేశించారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు ¬ంమంత్రి చెప్పారు.

జగన్‌ దిగ్భాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త కలచి వేసిందని ఆయన అన్నారు. ప్రమాదంలో పిల్లలు సహా అనేకమంది చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

ప్రధాని సంతాపం

అనంతపురం జిల్లా పెనుకొండవద్ద చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పెనుకొండ వద్ద ఈ ఉదయం బస్సు లోయలో పడిన ప్రమాదంలో 14మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

చిరంజీవి సంతాపం

అనంతపురం జిల్లాలో పల్లె వెలుగు బస్సు ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బుధవారం హైదరాబాద్‌లో  తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 15 లక్షల ఎక్‌స్గేష్రియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అలాగే ఈ ప్రమాదంపై టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు హరికృష్ణ కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *