మహమ్మద్ ప్రవక్తను అవమానపరుస్తూ కార్టూన్ల నేపథ్యం (కిక్కర్)
12 మంది హతం, మృతుల్లో ఎడిటర్ ఇన్ చీఫ్, కార్టునిస్ట్
ప్యారిస్,జనవరి7(జనంసాక్షి): సిడ్నీలో ఉగ్రదాడిని మరువక ముందే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో మరో ఘోరం జరిగింది. ఇక్కడ ఉన్న ఫ్రెంచి పత్రిక ‘చార్లి హెబ్డో’ కార్యాలయంలోకి జొరబడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు సాయుధ దుండగులు కాల్పులు జరపగా 12 మంది మృతిచెందారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. వారికోసం గాలింపు చేపట్టారు. ప్యారిస్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. సెంట్రల్ ప్యారిస్‌లో ‘చార్లి హెబ్డో’ వార పత్రిక కార్యాలయం వుంది. మృతుల్లో పత్రిక జర్నలిస్టులు, ఇద్దరు పోలీసులు ఉన్నట్లు సమాచారం.ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, అత్యాధునిక మిషన్ గన్లతో ప్యారిస్ నగరంలోని పత్రికా కార్యాలయం విూద విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ¬లండ్ తెలిపారు. ఫ్రాన్స్‌లోని అన్ని విూడియా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గత కొన్ని వారాలుగా పలు ఉగ్రవాద కుట్రలను ముందుగానే అడ్డుకున్నామని ¬లండ్ అన్నారు. తాజాగా చార్లీ హెబ్డో కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత హేయమైనదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పత్రికా కార్యాలయంలోకి ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా మెట్లు ఎక్కి లోపలకు వెళ్లిన ఉగ్రవాదులు.. ఆ తర్వాత ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపి, లాంచర్లతో రాకెట్లు కూడా ప్రయోగించారు. దాంతో పదిమంది అక్కడికక్కడే మరణించారు. తిరిగి పారిపోతూ.. రోడ్డువిూద ఉన్నవారిపై కూడా కాల్పులు జరిపారు. దాంతో ఓ పోలీసు అక్కడే మరణించారు. అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు పత్రికా కార్యాలయం సవిూపంలోని ఓ మెట్రో స్టేషన్ వైపు పారిపోయారు. వ్యంగ్యరచనలకు పేరొందిన చార్లి హెబ్డో వార పత్రిక వివాదాలకూ అంతే పేరు పొందింది. గతంలోనూ ఈ పత్రిక కార్యాలయంపై దాడి జరిగింది. ప్యారిస్ నగరంలోని చార్లి హెబ్డొ పత్రికా కార్యాలయంపై జరిగిన దాడిని ఫ్రాన్స్ అధ్యక్షుడు లాండె ఖండించారు. సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సవిూక్షించిన ఆయన ఇది ఉగ్రవాదుల పనేనన్నారు. ఉగ్రవాదాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఉగ్రవాదుల దాడిలో 12 మంది చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడినట్టు ఆయన వెల్లడించారు. మరో 40 మందిని భద్రతాదళాలు సురక్షితంగా రక్షించినట్టు ఆయన తెలిపారు. ప్యారిస్‌లోని చార్లిహెబ్డొ పత్రికా కార్యాలయంలోకి ఇద్దరు ఉగ్రవాదులు ముసుగులతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. అయితే వీరి సంఖ్య ఇద్దరి కంటే ఎక్కువ వుండవచ్చని మరి కొందరు పేర్కొనడం గమనార్హం. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా వున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న భద్రతాబలగాలు చార్లి హెబ్డొ కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. ఫ్రాన్స్ కమాండోలు లోపలకి ప్రవేశించారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం. ఫ్రాన్స్ రాజాధాని ప్యారిస్ నగరంలోని ఫ్రెంచి పత్రిక ‘చార్లిహెబ్డో’ కార్యాలయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఫ్రాన్స్‌లో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. అక్కడి పత్రికా కార్యాలయాలు, షాపింగ్ సెంటర్లు, మ్యూజియంలు, రైల్వేస్టేషన్లు… తదితర ప్రదేశాల్లో పోలీసు భద్రతను పెంచారు. ప్యారిస్‌లో ప్రముఖ పర్యాటకకేంద్రమైన ఈఫిల్‌టవర్‌ను మూసివేశారు. చార్లిహెబ్డొ పత్రికా కార్యాలయంపై ముగ్గురు సాయుధ దుండగులు దాడి జరిపి 12 మందిని చంపిన నేపథ్యంలో ఫ్రాన్స్‌లో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. భద్రతాచర్యల్లో భాగంగా ఈఫిల్‌టవర్‌ను కూడా మూసివేసినట్టు ఫ్రాన్స్ ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి.





