హైదరాబాద్, దేశంలోనే అత్యంత పొడగరిగా పేరొందిన కొలిపాక గట్టయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా గట్టయ్యకు గుర్తింపు ఉంది. గట్టయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గట్టయ్య స్వస్థలం కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పుట్నూర్ గ్రామం. గట్టయ్య మృతికి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.
అనారోగ్యంతో పొడగరి గట్టయ్య మృతి




