Monday, 2 November 2026

ఉత్తమ యువజన సంఘాల అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు(విద్య): భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడ ల మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ యువజన సంఘం అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రుయువ కేంద్రం సమన్వయకర్త బీజే ప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డులు రిజిస్ట్రర్‌ అయిన యువజన సంఘాలు, మరి యు మహిళా మండళ్లు గత ఏడాది అనగా ఏప్రిల్‌ ఒకటి 2014 నుంచి మార్చి 31 2015 వరకు విద్య, వైద్య, ఆరోగ్య,క్రీడలు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రమదానం, స్వచ్చభారత్‌ వృత్తిశిక్షణ తదితర కార్యక్రమాల్లో సేవలు అందించి ఉండాలి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, ప్రచురణలు, నిర్ణీత దరఖాస్తుతో జత చేసి నెహ్రూ యువ కేంద్రం కార్యాలయానికి పంపాలని సూచించారు. ఎంపికైన సంఘానికి రూ. 25వేలు అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న యువతీ యువకులు, మహిళా మండళ్ళు దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. దరఖాస్తులు నెహ్రూ యువ కేంద్రం, గాంధీపార్కు వెనుక, రా జాగారి తోట, గుంటూరు అనే చిరునామాకు, నవంబర్‌ ఏడులోగా అంద జేయాలన్నారు. వివరాలకు 0863-2220398లో సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *