అనారోగ్యంతో విదేశాలకు అజయ్‌ మాకెన్‌

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): అనారోగ్య కారణాలతో ఢిల్లీకి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ రాజీనామా చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన 2015 నుంచి కొనసాగారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఆయన రాహుల్‌కు లేఖ రాశారు. అనారోగ్యం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వైద్య చికిత్స నిమిత్తం మాకెన్‌ విదేశాలకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు గత వారమే రాహుల్‌కు తెలియజేసినట్లు మాకెన్‌ చెప్పారు. మూడేళ్ల క్రితం అర్విందర్‌ సింగ్‌ లవ్లీ నుంచి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను మాకెన్‌ స్వీకరించారు.