Tuesday, 3 November 2026

అన్నా బృందంలోకి అమీర్‌ఖాన్‌

ఈ నెల 10న కొత్త కమిటీ
ఢిల్లీ: నవంబర్‌ 6, (జనంసాక్షి) : అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకేళ్లేందుకు వీలుగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే ఈ నెల 10న కోత్త సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందంలో బాలివుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌కు కూడా చోటు కల్పించే అవాకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై ఆయన మాట్లడుతూ అవినీతికి వ్యతిరేకంగా రాజకీయేతర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకేళ్లేందుకు గాను కృషి చేస్తామని ఆయన తెలిపారు. సమన్వయ కమిటీ ఏర్పాటుపై వచ్చే రెండు రోజుల పాటు తన సహ ఉద్యమకారులతో చర్చలు జరిపి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమన్వయ కమిటీలో తోలుత 12 మంది సభ్యులను తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *