మోడీకి ధీటుగా ఎదిగే అవకాశాలున్న నేత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి26(జనంసాక్షి): అన్నా హజారే మరోమారు సమర శంఖం పూరించారు. ఆయనకు తోడుగా ఇప్పుడు సిఎం ¬దాలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తోడయ్యారు. అవినీతిని అంతం చేసే క్రమంలో అన్నా అభిప్రాయాలను గౌరవించి భూసేకరణపై కేంద్రం పునరాలోచన చేయాల్సిన సమయమిది. ప్రజలకోసమే అయితే,రైతులకు నష్టం జరగనిదే అయితే దేశవ్యాప్తంగా ఈ ఆర్డినెన్స్‌పై చర్చకు పెట్టాలి. కొత్త ఒరవడికి బిజెపి శ్రీకారం చుట్టాలి. బుల్‌డోజ్ వ్యవహారాలకు తాము వ్యతిరేకమని నిరూపించుకోవాలి. గత సమావేశాలు ముగిసిన కొద్దిగంటల్లోనే వరుసపెట్టి ఆర్డినెన్సులు జారీ చేశారు. ప్రతిపక్షాలు మోకాలడ్డినంత మాత్రాన అభివృద్ధి ఆగిపోదనీ, ఆర్డినెన్సులతోనైనా అనుకున్నది చేసుకుపోతామని ఆర్థికమంత్రి జైట్లీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ వల్ల భూహక్కుదారులు ముప్పు ఎదుర్కొబోతున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మారి, కార్పొరేట్లకు మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, నాయకులు ఆరోపించారు. ఈ వైఖరిపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన
‘జవిూన్ వాపసీ ఆందోళన్’లో వారు ప్రసంగిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గైర్హాజరు కావడం చర్చనీయాంశమయింది.
బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు ప్రతిపక్షాలను మచ్చిక చేసుకొనే పని జరిగినా, విస్తృతమైన చర్చలకూ మార్పు చేర్పులకూ సిద్ధమని ప్రకటించినా, అత్యంత ప్రధానమైన భూసేకరణ ఆర్డినెన్సుపై ఏమాత్రం రాజీలేని యుద్ధం చేయవలసిన అవసరం కాంగ్రెస్‌కు, ఇతర విపక్షాలకు ఉంది. ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ, ససేమిరా లొంగేది లేదంటూ మిత్రపక్షాలు సైతం కాలుదువ్వుతున్నాయి. సభ వెలుపల జంతర్‌మంతర్‌లో రెండురోజులు బైఠాయించి అన్నాహజారే చిసిన ఆందోళన ఇప్పుడు అన్ని పార్టీలకు ఓ టానిక్ లాంటిది. ఇక ఆయన అన్నట్లుగానే జైల్ భరో చేపట్టడం ఖాయం. అన్నా ఏదైనా చెబితే వెనకాడరు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా తన సామర్థ్యాన్ని చాటుకోవడానికి అందివచ్చిన ఒక మంచి అవకాశాన్ని రాహుల్ ఈ సమయంఓల చేజేతులా జారవిడుచుకున్నారు. దానితో పాటు ఒక అత్యంత అనుకూలమైన పరిస్థితిని అననుకూలంగా మార్చివేశారు. బీజేపీ ఘర్‌వాపసీకి ప్రతిజవాబుగా జవిూన్‌వాపసీ పేరిట జంతర్‌మంతర్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన రాహుల్ లేకుండా జరిగిపోయింది. నిజానికి యూపీఏ హయాంలో భూసేకరణ చట్టానికి మార్పుచేర్పులు చేసి రైతులకు నాలుగింతల పరిహారం దక్కేలా, కొన్ని రక్షణలు కల్పించేలా చేసారు. దీనిని ఘనంగా చాటుకున్నారు. చట్టానికి ఇప్పుడు తూట్లుపడినప్పుడు ముందుండి పోరాడవలసిన నాయకుడు ఉన్నఫళంగా మాయమైపోవడం విషాదం.
సార్వత్రక ఎన్నికలతో సహా వరుస పరాజయాలు కాంగ్రెస్ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీసిన మాట వాస్తవం. ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసీటు గెల్చుకోకపోయినా, మోదీ ప్రభంజనానికి ఎదురుదెబ్బ తగిలి ప్రతిపక్షాల విశ్వాసం పెరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో అన్ని శక్తులూ కలిసి సర్వశక్తులూ ఒడ్డినట్టే, నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీని ఒంటరిగా ఢీకొట్టలేమన్న జ్ఞానంతో నితీశ్-లాలూ వంటి బద్ధశత్రువులు కూడా చేతులు కలిపారు. కొండనైనా ఢీకొనవచ్చని కేజ్రీవాల్ ప్రూవ్ చేశారు. అన్నా విధానాలు ప్రజలు అంగీకరించారని రుజువయ్యింది. ఈ దశలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలన్న ప్రయత్నాలు ఏదో రూపంలో ఊపందుకున్నాయి. సభలో సమష్టిగా వ్యవహరించాలన్న ఆశయం శీతాకాల సమావేశాల్లో అరకొరగా నెరవేరినప్పటికీ, ఈ సమావేశాల్లో తమ ఐక్యతను మరింత స్పష్టంగా చాటి అధికారపక్షాన్ని ఢీకొట్టాలన్నది వాటి ఆశయంగా ఉంది. ఇంత తక్కువమంది సభ్యులున్నప్పటికీ ప్రతిపక్షాల ఆకాంక్షకు అద్దంపట్టి, సారధ్యం వహించగలిగే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నది. అయితే అన్నా ఆశయాలకు అనుగుణంగా కేజ్రీవాల్ ఢిల్లీయేతర సమస్యలపైనా గళం విప్పుతారా అన్నది చూడాలి. భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా యాన మాట్లాడారు. ఇక మోఢీని ఢీకొనే విధంగా కేజ్రీని రంగంలోకి దింపడంలో నఅ/-ని పార్టీలు ముందుకు వస్తే ప్రత్యమ్నాయ ప్రతిపక్ష నేతగా ఎదుగుతారనడంలో సందేహం లేదు.




