Wednesday, 4 November 2026

28 వరకు ఓపెన్‌ దరఖాస్తులకు అనుమతి

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 12వతేదీన ప్రవేశపరీక్ష జరుగుతుంది. ఈమేరకు గతంలోనే ప్రకటించిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈనెల 28తేదీవరకు ప్రవేశపరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా 18ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష సుబేదారిలోని ఆర్ట్స్‌ కళాశాలలో ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు అంబేడ్కర్‌ ఓపెన్‌ విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *