Wednesday, 4 November 2026

అన్ని గేట్లను రెండు రాష్ర్టాలు వాడుకోవాలి

హైదరాబాద్‌, (మార్చి 4): మరో మూడు రోజుల్లో రెండు రాష్ర్టాల అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఇవాళ రెండు రాష్ర్టాల స్పీకర్లు, మండలి చైర్మన్లు అసెంబ్లీహాల్‌లో సమావేశమయ్యారు. రెండు రాష్ర్టాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాల ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. రెండు రాష్ర్టాల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీలోని అన్ని గేట్టను రెండు రాష్ర్టాలూ ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. సమావేశాలు ప్రారంభమైన మూడు రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *