Wednesday, 4 November 2026

అన్ని పంచాయతీలలో వనం-మనం

విజయనగరం,ఆగస్టు25(జ‌నం సాక్షి ) : వెలుగు ఎపిఎం కె.భారతి ఆధ్వర్యంలో శనివారం విజయనగరం అన్ని పంచాయతీలలో వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీలన్నిటిలో మొక్కలు నాటారు. వెలుగు ఎపిఎం కె.భారతి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అందించే పథకాలన్నిటినీ ప్రజలు వినియోగించుకోవాలన్నారు. మొక్కలు మానవ మనుగడకు, జీవకోటికి ప్రాణాధారమని, ఇంటికొక మొక్కను నాటడం వల్ల ప్రకృతిపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బందితో పాటు మహిళా సంఘం ప్రెసిడెంట్‌ బి.స్వర్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.