Thursday, 5 November 2026

అన్ని స్థానాల్లో హిందూవేదిక పోటీ

హైదరాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల హిందూ వేదిక ప్రకటించింది. అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ దంటు నాగార్జున శర్మ, జనసంఘ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్‌శర్మ, హిందూ ఆదోళన ఏక్‌తా పక్ష్‌ ప్రతినిధి నాగేందర్‌ దీక్షితులు విలేకరులతో మాట్లాడారు.

మూడింటినీ కలపి తెలుగు రాష్ట్రాల హిందూ వేదిక ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీజేపీ కలసి వస్తే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రజాకారుల వారసత్వం ఉన్నా ఎంఐఎం పార్టీ గుర్తింపును

తక్షణమే రద్దుచేయాలరి డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించి, ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తమ వేదిక తరుపున 20 మంది ముస్లీంలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ వేదిక ఏ మతానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని వారు చెప్పారు.