అన్‌లాక్- 5 నిబంధనలు పొడగింపు
హైదరాబాద్,అక్టోబరు 27(జనంసాక్షి): కోవిడ్ నేపథ్యంలో అన్‌లాక్ 5 నిబంధనలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆ మార్గదర్శకాలే నవంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తాయని ఇవాళ కేంద్ర ¬ంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్ కేంద్రాలను షరతులతో ఓపెన్ చేసేందుకు నవంబర్ 30వ కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్గదర్శకాలను నవంబర్ చివరినాటి వరకు పొడిగిస్తున్నట్లు ఇవాళ కేంద్రం ¬ంశాఖ స్పష్టం చేసింది.కంటేన్మెంట్ జోన్లలో మాత్రం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో ఎటువంటి నిబంధనలు లేవని చెప్పింది. ఆ రాకపోకలకు ఎటువంటి పర్మిషన్-అనుమతి అవసరం లేదు. సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ సెప్టెంబర్ 30వ తేదీన కేంద్ర ¬ంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సినిమాహాళ్లను తెరిచాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు మత్రం థియేటర్లను తెరవలేదు. ప్రస్తుతం అక్టోబర్ నిబంధనలనే పొడిగించడం వల్ల థియేటర్ల యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..