అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

తిరుపతి,జూలై 2(జ‌నం సాక్షి ): చిత్తూరు జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధలు తాళలేక పుత్తూరులో కామరాజు నగర్లో నివాసముంటున్న మాణిక్యం, భువన అనే దంపతులు విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరూ అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. భువన(35) మృతిచెందగా, భర్త మాణిక్యం(43) పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం మాణిక్యాన్ని తిరుపతికి రెఫర్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.