అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
రైతు గత ఏడాది సాగు చేసి పండించిన పంటకు సరిగా దిగుబడి రాక అప్పుల ఊబిలో చిక్కుకొని తను మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కుంటాల కే గ్రామానికి చెందిన చిటి నరేష్(33) ఇతనికి భార్య ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు.పోయిన ఏడాది 4ఎకరాల భూమి సాగుచేశారు.ఉన్న భూమిలో పత్తి పంటను సాగు చేయగా దిగుబడి రాక సాగుకోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితిలో మనస్తాపం చెంది శనివారం రోజు రాత్రి 8గంటల ప్రాంతంలో ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.అంతలోనే గమనించిన ఇంటివాళ్ళు స్థానికులు108 అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించి  చికిత్స నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కుటుంబీకుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.