అబద్ధాల ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారు

*జార్ఖండ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ ప్రకాష్ తూప్రాన్( జనం సాక్షి )జూన్ 30 :: అబద్దాల తెలంగాణ ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు సరి అయిన సమయంలో సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జార్ఖండ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు దీపక్ ప్రకాష్ పేర్కొన్నారు వచ్చే నెల 3న మోడీ బహిరంగ సభ ఈ సందర్భంగా తూప్రాన్ కు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు డబల్ బెడ్ రూమ్ లో ఎక్కడికి వెళ్లాలి అని ఇంటింటికి ఉద్యోగం ఎక్కడ పోయాయని 3 ఎకరాల భూమి ఎక్కడ పోయిందని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఆయన అమలు చేయడం లేదని విమర్శించారు ఆయన చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వారు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు దేశ ప్రధాని మోదీ అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టారని 8 ఏళ్లలో ఆయన సాధించిన విజయం ఇతర దేశాల వారు అభినందిస్తున్నారని అన్నారు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాల ముఖ్యమంత్రి అని డబుల్ బెడ్ రూమ్స్ ఎక్కడ పోయాయి అని ప్రశ్నించారు రాబోయే రోజుల్లో  ముఖ్యమంత్రి గజ్వెల్ నియోజకవర్గంలో బిజెపి జండా ఎగరవేస్తాం అని ఆయన అన్నారు దేశ రాష్ట్రపతి అభ్యర్థి గా మహిళ ఆదివాసీ బిజెపి నిర్ణయానికి  తెలంగాణ కేసీఆర్ వ్యతిరేకంగా మరో వ్యక్తికి మద్దతు ఇస్తున్నారు అని  కేసీఆర్ కు మహిళలు  ఆదివాసుల తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు..
జులై 3న దేశ ప్రధాని తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పార్టీ రాష్ట్రాల నాయకులు హాజరవుతున్నారు ప్రతి ఇంటి నుండి సభ కు తరలిరావాలని పిలుపునిచ్చారు ..తెలంగాణ లో రానున్న ఎన్నికలలో బీజేపీకే అధికారం కట్టబెట్టే అందుకు ప్రజలు బీజేపీ పాలన కోసం  ఎదురుచూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మహేష్ గౌడ్ రామ్మోహన్ గౌడ్ యాదగిరి ఆంజనేయులు సిద్ధిరాములు కౌన్సిలర్ జమాల్పూర్ లక్ష్మీబాయి నర్సోజి తాటి విట్టల్ సాయిబాబా గౌడ్ పోచేందర్ మధుసూదన్ నాగరాజు వేణు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Attachments area