Thursday, 5 November 2026

అభయహస్తం పింఛన్ల కోసం రాస్తారోకో

దండేపల్లి : సకాలంలో అభయహస్తం పింఛను పంపిణీ చేయనందుకు నిరసనగా పింఛను లబ్ధిదారులు శుక్రవారం రాస్తారాకోకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి బస్టాండ్ వద్ద మండలంలోని అన్ని గ్రామాల అభయహస్తం పింఛను దారులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు నెలలుగా అధికారులు పింఛను పంపిణీ చేయడం లేదని పింఛను దారులు వాపోయారు. ఇప్పటినుంచి సకాలంలో పింఛను పంపిణీ చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *