Tuesday, 3 November 2026

అభవృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న కోడెల

గుంటూరు,నవంబర్‌13(జ‌నంసాక్షి): నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో మంగళవారం ఎపి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పర్యటించారు. రొంపిచర్ల మండలంలోని విప్పర్లరెడ్డిపాలెం, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. స్పీకర్‌ను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ గ్రామాల్లోని పలు అభివఅద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విపర్లరెడ్డిపాలెంలో ఎపి మోడల్‌ స్కూల్‌ ప్రహరీ శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు, కొత్తపల్లిలో రోడ్లు, ఇళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.