Tuesday, 3 November 2026

నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): కన్సల్టెన్సీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లు, రబ్బర్‌ స్టాంప్స్‌, లెటర్‌ హెడ్స్‌, ఇతర మెటీరియల్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. బేగంపేట, ఎస్సార్‌ నగర్‌ లలో జస్ట్‌ వీసా కన్సల్టెన్సీ, ఇండో యూరోపియన్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని సీపీ తెలిపారు. జేఎన్టీయూ, ఉస్మానియా, నాగార్జున, మద్రాస్‌ యూనివర్సిటీలు, కాకినాడ గీతం పేరుతో నకిలీ పట్టాలు తయారు చేస్తున్నారని వెల్లడించారు. నిందితుల నుంచి 680 నకిలీ సర్టిఫికెట్స్‌,

680 ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, 96 రబ్బర్‌ స్టాంప్స్‌, 10 పెన్‌ డ్రైవ్స్‌, ల్యాప్‌ టాప్స్‌, 89 నకిలీ లెటర్‌ హెడ్స్‌ స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజనీకుమార్‌ వివరించారు.