కోలారు: అభిమానం వికృతరూపం దాల్చి ఒకరి ప్రాణాల్ని బలితీసుకుంది. ఆదివారం రాత్రి ఇక్కడికి సమీపంలోని నరసాపుర వద్ద హోటల్‌లో ఇద్దరు తెలుగు హీరోల (పవన్ కల్యాణ్- జూనియర్ ఎన్టీఆర్) అభిమానులు ఘర్షణ పడ్డారు. ఈ సంఘటనలో వినోద్‌కుమార్ (24) అనే వ్యక్తి హత్యకు గురైనాడు. నటుడు సుమన్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి అభిమానులు ఇక్కడకు వచ్చారు. కార్యక్రమం అనంతరం హోటల్‌లో మద్యం సేవించే సమయంలో తమ అభిమాన నటుల గురించి చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఒకరు గొప్ప అంటే- మరొకరు గొప్ప అంటూ వాగ్వాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఛాతీపై కత్తిపోట్లకు గురైన వినోద్‌కుమార్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి అక్షయ కుమార్, మరికొందరిని అరెస్టు చేశారు. వేమగల్ పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు.