అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

 కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్
కోల్లాపూర్ పట్టణంలోని మాజీ మంత్రి జూపల్లి గారి క్యాంప్ కార్యాలయంలో మలి దశ తెలంగాణ పోరాట తొలి అమరవిరుడు కి:శే,శ్రీకాంత్ ఆచారి గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు* తన అనుచరులతో కలిసి శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించి అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు

ఈ సందర్భంగా మాజీ మంత్రి జూపల్లి గారు మాట్లాడుతూ మలి దశ తెలంగాణ ఉద్యమంలో  శ్రీకాంతాచారి  ఆత్మ బలిదానం యావత్ ప్రపంచాన్నే కదిలించింది అని  అమరవీరుల త్యాగాలు  మర్చిపోలేని ఉద్యమ పోరాటాలు అని అమరవీరుల త్యాగఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర పలితం అని జూపల్లి గారు నాటి ఉద్యమ పోరాటాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ వారి  ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని జూపల్లి గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జూపల్లి గారితో పాటుగా కొల్లాపూర్ పట్టణ కౌన్సిలర్ లు,సింగిల్ విండో డైరెక్టర్ లు,ఇతర ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు మరియు జూపల్లి గారి అనుచరులు పాల్గొన్నారు