అమరావతికి పెట్టుబడుల వెల్లువ

రానున్న రోజుల్లో పుంజుకోనున్న రియల్‌ రంగం

అమరావతి కేంద్రంగా ప్రధాన సంస్థల కార్యకలాపాలు

అమరావతి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ను మించి అమరావతిని అభివృద్ది చేసి చూపుతామని.. ఉద్యోగాల కోసం ఎక్కడో వెతక్కోవాల్సిన పని లేకుండా చేస్తామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు విశ్వాసం నింపేలా ఉన్నాయి. అమరావతిలో అంతర్జాతీయ సంస్థలు మెల్లగా క్యూకడుతున్న తీరు చూస్తుంటే రానున్న కాలంలో అమరావతి నిర్మిణం నాటికి దశ మారనుందని గుర్తించాలి. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మాణానానికి శంకుస్థాపన వేసిన సమయంలో ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌లను చూస్తే అదో ప్రపంచం కనిపిస్తుంది. అలాగే రియల్‌ రంగానికి మూడేళ్ళుగా మార్మోగుతున్న పేర్లు విజయవాడ-గుంటూరు. అందుకు కారణం ‘అమరావతి’లో ఏపీ సర్కారు నూతన రాజధాని ప్రకటించమే. అంతే అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్‌ను మించి అమరావతిని అభివృదద్‌ఇ చేస్తానని సిఎం చంద్రబాబు పదేపదే ప్రకటిస్తున్నారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకుంటుందని అంచనాలు వెలువడ్డాయి. రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి రేటు ఆ ప్రాంతంలో ఆశించినంతగా ప్రస్తుతానికి లేకున్నా రానున్న కాలంలో రాజధాని ఏర్పడితేఇప్పుడున్న ధరలు అందుబాటులో లేకుండా పోతాయన్న అంచనాలు ఉన్నాయి. భూములు కొనుగోలు చేసిన వాళ్ళు ఇఫ్పుడు టెన్షన్‌ పడ్డా, వచ్చేది మంచి కాలమని గుర్తుంచుకోక తప్పదు. హైదరాబాద్‌తో విజయవాడ పోటీపడాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని..అక్కడ చాలా మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉందని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ పరిశోధనా సంస్థ ‘నైట్‌ ఫ్రాంక్‌’ వెల్లడించింది. మౌలిక వసతుల లేమి.. నిపుణుల లభ్యత లేకపోవడం.. విపరీతమైన అద్దెల మోత విజయవాడలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి ప్రధాన అవరోధాలుగా మారాయని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సిఎం చంద్రబాబు కూడా స్వయంగా చెబుతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో వృద్ధికి ఎవరున్నా ఢోకా ఉండదు. హైదరాబాద్‌తో పోటీపడాలంటే విజయవాడలో మౌలిక వసతులు పెరగడంతోపాటు అద్దెలు దిగి రావాల్సిన అవసరముందని సిఎం చంద్రబాబు పదేపదే చెబుతూనే ఉన్నారు. రాజధాని నిర్మాణం పూర్తయి.. మౌలిక వసతులు ఏర్పడిన తర్వాతనే ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకునే వీలుంటుంది. సచివాలయాన్ని అమరావతికి తరలించడంతో వాణిజ్య, నివాస స్థలాలకు బాగా డిమాండ్‌ ఏర్పడి అద్దెలు విపరీతంగా పెరిగాయి. రానున్న కాలంలో దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా అమరావతి ఉండబోతోంది. ఇకపోతే అనంతపురం- అమరావతి ఎక్స్‌ ప్రెస్‌ వేపై నిర్మాణం పూర్తి చేసుకుంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌ కానుంది. ఇది రాయలసీమకు గేట్‌వేలా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టుకు భూ సేకరణ అసలు సమస్య కానుంది.తొలుత భూ సేకరణ ఖర్చును తామే భరిస్తామని..ప్రాజెక్టును ఓకే చేయాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చారని సమాచారం. దీంతో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మూలనపడే పరిస్థితి వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. రాయలసీమ వాసులు నూతన రాజధాని ప్రాంతం అయిన విజయవాడకు వెళ్ళాలంటే ఎంతో కష్టం. దీన్ని నివారించేందుకే ఆరులైన్ల ఎక్స్‌ ప్రెస్‌ను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపటంతో ఇది కొంత ఆలస్యం అయినా కార్యరూపం దాలుస్తుందని భావించారు. కానీ ఇప్పుడు భూ సేకరణ విషయంలో పేచీ రావడంతో కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. తొలుత భూ సేకరణ చేస్తామని చెప్పిన సర్కారు, దీనికిమూడు వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీతో మాట్లాడి చంద్రబాబు అప్పట్లో దీనికి ఓకే చేయించారు. ఈ రోడ్డుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా సిద్ధం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ రోడ్డు ప్రాజెక్టు టేకాఫ్‌ అవుతుందని భావించిన కొంత మంది ఎంపీలు..ఎమ్మెల్యేలు ఈ మార్గంలో పెద్ద ఎత్తున భూములు కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నారు. దీనిని సకాలంలో పూర్తి చేస్తే రాయలసీమ అభిశీద్దికి దోహదకారి కాగలదు.

 

తాజావార్తలు