Tuesday, 3 November 2026

అమీర్‌పేట్ లేడీస్ హాస్టల్‌లో అర్థరాత్రి కలకలం…

amrpetహైదరాబాద్/హైదర్‌నగర్‌: మహిళా హాస్టళ్లలో సెల్‌ఫోన్‌లు దొంగిలించి అందులో ఉన్న నెంబర్ల వారికి ఫోన్‌చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టుచేశారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ కుషాల్కర్‌ వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ పెద్దంపేటకు చెందిన సిలివేరి సంతోష్‌కుమార్‌ బోరబండ పర్వతనగర్‌లో నివసిస్తూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌ పోలీష్‌స్టేషన్‌ల పరిధిలోగల మహిళా హాస్టళ్లలో రాత్రిపూట సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్నాడు. ఆ సమయంలో వారు మేల్కొన్నప్పుడు బ్లేడ్‌ చూపించి బెదిరించేవాడు. ఓ హాస్టల్‌లో ఉంటున్న మహిళ ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నిందితుడిని హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకుని 8 సెల్‌ఫోన్‌లు, రెండు మెమరీకార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అతడిపై వేర్వేరు పోలీస్‌స్టేషన్‌లలో 9కేసులు నమోదయ్యా యన్నారు. కరీంనగర్‌లో మహిళలను గతంలో వేధించిన కేసులో జైలుకెళ్లి వచ్చాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ హాస్టల్‌ల్లోనూ సీసీ కెమెరాలు లేవని.. ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సీఐ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *