Friday, 6 November 2026

అమెరికాలోని ఓక్లహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఫణీంద్ర

చంద్రుగొండ: అమెరికాలోని ఓక్లహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరాడు ఆ యువకుడు. కుటుంబానికి అన్ని విధాలా ఆసరా అవుతాడనుకుంటే కుటుంబం దిక్కులేనిది అయ్యింది. అతడు ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం దామచర్ల గ్రామానికి చెందిన గాదె ఫణీంద్ర. ఈ ఏడాది మే నెలలో స్కగ్రామానికి వచ్చినప్పుడు మళ్లీ తాను సెలవులో వచ్చినప్పుడు గుండె జబ్బుతో బాధపడుతున్న తల్లికి అపరేషన్‌ చేయిస్తానని చెప్పి ఆ నెలాఖరున అమెరికాకు వెళ్లాడు. అయితే గురువారం అర్ధరాత్రి సమయంలో అమెరికాలోని ఒక్టహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన అయిదుగురు తెలుగువారిలో ఫణీంద్ర ఒకడు. దామరచర్ల గ్రామానికి చెందిన గాదె శివప్రసాద్‌, స్వర్ణ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు ఫణీంద్ర. షణీంద్ర మృతి చెందాడన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు శివప్రసాద్‌ను, అతని భార్య స్వర్ణను మండలంలోని స్వగ్రామం దామరచర్ల నుంచి కొత్తగూడెంలోని శివప్రసాద్‌ సోదుని ఇంటికి తీసుకెళ్లారు. ఫణీంద్ర మృతి వార్త తెలిసిన వారంతా శనివారం కొత్తగూడెం వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *