Tuesday, 3 November 2026

ప్రియుడితో కలసి వెళ్లేందుకు పన్నాగం

చనిపోతున్నానంటూ రాసిన లేఖతో కలకలం

హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): ప్రియుడితో కలిసి వెళ్లేందుకు ఓ యువతి ఆడిన పన్నాగం పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఈ ఘటన రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం సృష్టించింది. లేక్‌పోలీస్‌, రాంగోపాల్‌పేట పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు ధనలక్ష్మి, సీహెచ్‌ బాబుల కథనం ప్రకారం…రాణిగంజ్‌కు చెందిన ఓయువతి (28)ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంది. ఉదయం తన చెల్లెలితో కలిసి ఎంఎంటీఎస్‌ రైళ్లలో విధులకు బయలు దేరింది. సంజీవయ్య పార్క్‌ దగ్గరకు రాగానే చెల్లిలికి ఓ లేఖ ఇచ్చి మధ్యలో రైలు దిగి వెళ్లి పోయింది. లేఖలో అమ్మానాన్న నన్ను క్షమించండి నేను చనిపోతున్నాను అని రాసి ఉంది. సంజీవయ్య పార్క్‌ సవిూపంలో నాలాలో ఓ యువతి దూకిందనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో నాలాలో గాలించారు. అయినప్పటికీ ఫలితం లేదు. సాయంత్రం 6 గంటల సమ యంలో ఇంట్లో కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తాను ప్రియుడితో వెళ్లి పోయిన సంగతిని తాపీగా చెప్పింది. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు పోలీసులు నానా హైరాన పడ్డారు. చివరకు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.