Tuesday, 3 November 2026

అమెరికాలో విమానం కూలి ఆరుగురు మృతి

americaవర్జీనియా: తేలికపాటి ప్రైవేట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని వర్జీనియాలో చోటుచేసుకుంది. ఫ్రెడెరిక్స్‌బర్గ్‌లోని షాన్నన్‌ విమానాశ్రయం వద్ద ఈ విమానం కుప్పకూలినట్లు పోలీసులు వెల్లడించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యే క్రమంలో సమస్య తలెత్తడంతో తిరిగి టేకాఫ్‌ అయ్యిందని తర్వాత వెంటనే విమానాశ్రయ సమీపంలోని చెట్లపై కూలిపోయిందని చెప్పారు. విమానం కూలగానే మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న ఆరుగురు మృతిచెందారు. సహాయక సిబ్బంది ఆరు మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *