అమ్మలా చూసుకునే అంగన్వాడీలు
అంగన్వాడీలో చేర్పించే చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాలు అమ్మలా చూసుకుంటాయని నంగునూరు ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు శనిగరం కనకయ్య అన్నారు. బడి బాట కార్యక్రమంలో నంగునూరు మండల కేంద్రంలో శుక్రవారం రోజున అవగాహన కల్పించి ఆరుగురు పిల్లలను అంగన్వాడీ నాలుగో కేంద్రంలో చేర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ.. ప్రభుత్వ బడిలోనే అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ బడులపై నమ్మకంతో పిల్లల్ని చేర్పించే తల్లి దండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోఅంగన్వాడి టీచర్ సుద్దాల లక్ష్మి,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎనగందుల మనీష్ కుమార్, ఉపాధ్యాయులు తహసీన్ సుల్తానా, శనిగరం కనకయ్య, కోల శ్రీనివాస్ గౌడ్, పత్రి మల్లేశం, ఆకుల శ్రీనివాస్, పి పరమేశ్వరులు, పాల్గొన్నారు.